| Daily భారత్
Logo




ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

News

Posted on 2026-09-11 14:50:44

Share: Share


ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

డైలీ భారత్, కామారెడ్డి :జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే ప్రాంగణంలో లో బిసి ల ధర్మ పోరాట దీక్ష చేపట్టడం జరిగింది.

జనగణన లో కులగణనను తప్పనిసరి చేస్తూ ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి.శాస్త్రీయ పద్ధతిలో జనగణన చేపట్టకపోతే వేల కోట్ల ప్రజాధానం వృధా అవుతుందని అన్నారు.ప్రతీ కులాన్ని నమోదు చేసేలా పారదర్శక విధానంలో లెక్కింపు జరగాలని అన్నారు.

దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ప్రకటించింది.

కానీ ఇప్పుడు కులగనన శాస్త్రీయమైన పద్ధతిలో చేయకుండా,ఓబీసీ కుటుంబాలను లెక్కించకుండా,బీసీ కాలం లేకుండానే,రెండవసారి కూడా జాతీయ జన గణన ఆగస్టు 17వ తేదీ నుండి ప్రారంభం మొదలుపెట్టింది.

కొంత మంది బిసి వ్యతిరేకులు బీసీ కులగననను తప్పుదారి పట్టించడానికే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం చేపడుతున్నారు.

రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేసేవాళ్లంత దేశద్రోహులే అని అన్నారు.

రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు మొదటగా రాజ్యాంగానికి విరుద్ధంగా అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేయాలని ఆ తర్వాతనే సామాజిక రిజర్వేషన్లపై చర్చ పెట్టాలని కోరారు, రిజర్వేషన్లపై ప్రతిరోజు కుట్రలు చేస్తున్న వారికి ఒకటి సవాల్ చేస్తున్నాo, రిజర్వేషన్లు రద్దు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ దేశ సంపదను, దేశంలోని సహజ వనరులను పందికొక్కుల దోస్కతిన్న కార్పొరేట్ దిగ్గజాలు, పెట్టుబడుదారులు, భూస్వాములు మొదలుకొని అందరి ఆస్తి హక్కులను రద్దుచేసి, దేశ సంపదను జాతీయం చేసి జనాభా దామాషా ప్రకారం సమానమైన పంపిణీ చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు రద్దు చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జనగణన లో కులగణన చేర్చాలని లేని పక్షంలోపెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు..

ఈ దీక్షకు సంఘీబావంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ విచ్చేసి మద్దతు తెలిపి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

దీక్షకు మద్ధతుగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి,కో అప్షన్ సభ్యులు కుంబాల రవి,కౌన్సిలర్లు విచ్చేసి సంఘీబావం తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సాప శివరాములు,ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్,బాజ లలిత,క్యాతం సిద్ధరాములు,గణేష్ నాయక్,తాహెర్,కొత్తపలి మల్లన్న,ఒడ్డె ఎల్లయ్య,చాకలి రాజయ్య,వెంకట స్వామి, విఠల్,రమేష్,ప్రవీణ్, హజీజ్, కాంగ్రెస్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >