| Daily భారత్
Logo




సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

News

Posted on 2026-09-12 14:34:53

Share: Share


సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

జీఎంకు టీబీజీకేఎస్ వినతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) లో గుర్తింపు కార్మిక సంఘాల రెండేళ్ల కాలపరిమితి ముగిసినందున, కొత్త ఎన్నికలు జరిగే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలని కోరుతూ టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ ఆధ్వర్యంలో జీఎం సీహెచ్ వెంకటరమణ గారికి మెమొరాండం అందజేశారు.

ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ, సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా 27.12.2023న నిర్వహించబడ్డాయని, అదే రోజు డిప్యూటీ సీఎల్సీ (హైదరాబాద్) కార్యాలయం ద్వారా ఫలితాలు ప్రకటించారని తెలిపారు. యూనియన్ల అంతర్గత అంశాల కారణంగా గుర్తింపు పత్రాలు 09.09.2024న అందాయన్నారు.

ఎన్నికల తేదీ 27.12.2023 నుండి లెక్కించినా, గుర్తింపు పత్రం అందుకున్న తేదీ నుండి లెక్కించినా 08.09.2026 నాటికి రెండేళ్ల కాలపరిమితి పూర్తయిందని స్పష్టం చేశారు.

సింగరేణిలో గత ఏడు దఫాలుగా డీవైసీఎల్సీ ఆధ్వర్యంలో రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి TBGKS తరపున హైకోర్టులో వేసిన పిటిషన్ నేడు విచారణకు రాగా 22వ తేదీకి వాయిదా పడిందని తెలిపారు.

సింగరేణి సంస్థలో ప్రజాస్వామ్యయుతమైన, పారదర్శకమైన ప్రాతినిధ్య వ్యవస్థను కొనసాగించేందుకు వీలైనంత త్వరగా నూతన ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా (Equal Status) వర్తింపజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, ఇంచార్జ్ జీకే సంపత్ కుమార్, ఫిట్ సెక్రటరీ దివ్య, తిరుపతి, నమిల్ల వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, అన్వర్, రాములు, శ్రావణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >