| Daily భారత్
Logo




భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

News

Posted on 2024-02-27 14:30:22

Share: Share


భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు

భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై  ప్రజలు ధైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల  తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భూ సమస్యల్లో జోక్యం చేసుకొని భూ కబ్జాలకు పాల్పడుతూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్న తంగళ్ళపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై తంగళ్ళపల్లి పోలీస్ లు కేసు నమోదు చేయడం జరిగిందని, భూ కబ్జాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దైర్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని జిల్లా ఎస్పీ  తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

తంగళ్ళపల్లి మండలంలోని లక్ష్మీపూర్ శివారులో గత 45 సంవత్సరాల క్రితం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య కొనుగోలు చేసిన భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన కోడి అంతయ్య అనే వ్యక్తి అట్టిని భూమిని అక్రమించాలనే ఉద్దేశంతో గుర్రం అంజయ్యను మరియు కుటుంబ సభ్యులను బెదిరించి కొంత భూమిని కబ్జా చేసినందుకు అతనిపైన కేసు నమోదు చేయడం జరిగిందని మరియు తంగళ్ళపల్లి శివారులోని శోభ అనే మహిళ యొక్క భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో వారి భూమిలోకి అక్రమంగా ప్రవేశించిన కోడి అంతయ్య పైన కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. భూమి పత్రాలు లేకున్నా నకిలీ భూ పత్రాలు సృష్టించి మోసం చేసి డబ్బులు తీసుకున్న వట్టిమల్ల శ్రీనివాస్ పై కేసు నమోదు.

భూమి లేకున్నా ఉన్నట్టు నమ్మించి నమ్మకం చేసిన వ్యక్తి పైన కేసు నమోదు తంగళ్ళపల్లి మండలంలోని అంకుషాపూర్ దారిలో గల సర్వేనెంబర్ 160 లో ఉన్నటువంటి రెండు గంటల  భూమి తన పేరును లేకపోయినా ఉన్నదని నమ్మించి  చిలుక.శ్రీనివాస్ అనే వ్యక్తి తో ఒప్పందం చేసుకొని అతని వద్ద నుండి 8 లక్షల 40 వేల రూపాయలు తీసుకున్న వట్టి మల్ల శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో భూ కబ్జాలు చేస్తూ, నకిలీ భూ పత్రాలు సృష్టించి బెదిరింపులకు పాల్పడే వారి సమాచారం వారి నేర ప్రవృత్తి ప్రజలు ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు.

Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >