Posted on 2026-07-18 06:16:11
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మొత్తం 06 పతకాలు సాధించిన పోలీసు సిబ్బంది
జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని విజేతలకు ఎస్పీ ఆకాంక్ష
పతక విజేతలను ఘనంగా సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7 నుండి 9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి ఒక స్వర్ణ పతకం, రెండు రజత పతకాలు, మూడు కాంస్య పతకాలతో మొత్తం 06 పతకాలు సాధించి జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.
ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు విధుల్లో సమర్థతతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శప్రాయమని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక స్థైర్యాన్ని, క్రమశిక్షణను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, ఇవే లక్షణాలు విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
జిల్లా పోలీసు శాఖలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, సిబ్బంది తమ విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తెలంగాణ పోలీసు శాఖకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఏఆర్ డిఎస్పి ఉదయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో జిల్లా నుంచి వివిధ క్రీడల్లో పాల్గొనగా, అందులో ఐదుగురు పోలీసు సిబ్బంది మొత్తం 06 పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.
పతక విజేతల వివరాలు:
1. ఎన్. ఉత్తేజ్ (పీసీ), కామారెడ్డి పోలీస్ స్టేషన్ - వుషూ (80 కేజీలు) – స్వర్ణ పతకం , బాక్సింగ్ (80 కేజీలు) – రజత పతకం
2. పి. బాలరాజు (పీసీ), నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ - రెజ్లింగ్ (ఫ్రీ స్టైల్ – 97 కేజీలు) – రజత పతకం
3. జె. అంకోష్ (పీసీ), డీఏఆర్, కామారెడ్డి - రెజ్లింగ్ (గ్రెకో రోమన్ – 87 కేజీలు) – కాంస్య పతకం
4. ఎన్. ప్రభు (పీసీ), డీఏఆర్, కామారెడ్డి- రెజ్లింగ్ (గ్రెకో రోమన్ – 97 కేజీలు) – కాంస్య పతకం
5. చి. వినయ్ రెడ్డి (పీసీ), ఎస్‌ఎస్ నగర్ పోలీస్ స్టేషన్ - కరాటే (60 కేజీలు) – కాంస్య పతకం
భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి కామారెడ్డి జిల్లా, తెలంగాణ పోలీసు శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, పతక విజేత పోలీసు క్రీడాకారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >