Posted on 2026-07-18 06:13:42
సమస్యల పరిష్కారం గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యం
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
నరసన్నపల్లి సర్పంచ్ రాసమొల్ల రవి
డైలీ భారత్ కామారెడ్డి :కామారెడ్డి మండలం నర్సన్న పల్లి గ్రామాన్ని కామారెడ్డి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని సమస్యల పరిష్కారానికి గ్రామ అభివృద్ధికి అవిరళ కృషి చేస్తామని సర్పంచ్ రవి స్పష్టం చేశారు.గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సర్పంచ్ రాసమోల్ల రవి తెలిపారు. తనను కలిసిన విలేకరులతో రవి మాట్లాడుతూ గ్రామంలో నీటి సమస్య ప్రధానంగా ఉందని నీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానన్నారు. సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, నీటి సమస్య నివారణకు, బోరు బావి తవ్వకానికి కల్వర్టు నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విన్నవిoచామని నిధుల మంజూరుకు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ హామీ ఇచ్చారని తెలిపారు. నరసన్న పల్లి గ్రామ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీకి చేరినట్లు, స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిచానని నరసనపల్లి సర్పంచి రవి తెలిపారు.
రైతుల సంక్షేమం, మహిళాభివృద్ధి కోసం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దపీట వేస్తుందని సర్పంచ్ రవి తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు. కామారెడ్డి జిల్లాలోని నరసన్నపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరం ఉన్న నిధులు అందజేస్తానని గ్రామానికి నిధుల కోరత లేకుండా చూస్తానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ హామీ ఇచ్చినట్లు నరసన్నపల్లి సర్పంచ్ రాసమొల్ల రవి స్పష్టం చేశారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >