Posted on 2026-07-17 14:10:00
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆహారం తీసుకున్న అనంతరం పలువురు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్న వారిని వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ ఆసుపత్రిని సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సిబ్బందికి ఆదేశాలు...
బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అవసరమైన మందులు, IV ఫ్లూయిడ్స్‌తో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ సిబ్బందికి సూచించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద ఆహారాన్ని తినవద్దని, ఆహారం తర్వాత అస్వస్థత వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
ఈ పరామర్శలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
#Siricilla #FoodPoisoning #DMHO #TelanganaNews #Health
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >