Posted on 2026-07-17 13:51:23
మాదిగ హక్కుల దండోరా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామంలో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న స్వప్న అనే దళితురాలిని కులం కారణంగా సర్పంచ్ హెడ్మాస్టర్ కూడా పలుకొని విధుల నుండి తొలగించడానికి మాదిగ హక్కుల దండోరా నిజాంబాద్ జిల్లా కమిటీ తరపున ఖండిస్తున్నామని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిర్పంగి దుర్గారాజ్ మాదిగ జిల్లా అధ్యక్షులు గాదెపగా గోపి మాదిగ ఉమ్మడి నిజామాబాదు మహిళా ఇంచార్జి ఆదరి సరిత మాదిగ తెలియచేశారు. శుక్రవారం నగరంలోని సుభాష్ నగర్ లో గల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నేటి రోజుల్లో కూడా ఇంకా కుల వివక్ష చూపడం సరైన పద్దతి కాదని తెలియజేస్తున్నాం ఇందుకు కారణమైన హెడ్మాస్టర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో దళితుల మీద దాడులు అధికమవుతున్నాయని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని కోరారు. గత కొద్దీ రోజుల క్రితం పెద్దపెల్లి జిల్లాలో దళితులను గుడిలోకి రానివ్వలేదని అలాగే కొత్తపెళ్లి చేవెళ్లలో కూడా ఇలాంటి సంఘటన జరిగాయని దళితుల పట్ల వివక్షత మరింత అధికమవుతుందని ఈ సంఘటన రుజువు చేస్తున్నాయని తెలియజేశారు. దళితులను చిన్నచూపులు చూసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా మాదిగ హక్కుల దండోరా నిలబడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాంపల్లి గంగాధర్ మాదిగ గారు రావర్తి రవికుమార్ మాదిగ, బీసీ సంఘం నాయకులు నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >