| Daily భారత్
Logo




పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

News

Posted on 2026-03-13 14:40:41

Share: Share


పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144) అమలు.. జిరాక్స్ సెంటర్లు, మొబైల్ ఫోన్లపై నిషేధం.

జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ఐపీఎస్  

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 16 వరకు జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను అత్యంత ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ఐపీఎస్  తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పరీక్షా సమయమైన ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు సెక్షన్ 163 BNSS (గతంలో 144 సెక్షన్) అమలులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం పూర్తిగా నిషేధమని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులను పరీక్షా సమయంలో తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, విద్యార్థులు ఎలక్ట్రానిక్ వాచీలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావద్దని, పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మరియు పోలీస్ సిబ్బంది సైతం మొబైల్ ఫోన్లు వినియోగించరాదని ఎస్పీ  కఠిన ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తగిన బందోబస్తు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పరీక్షల క్రమశిక్షణను కాపాడటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >