| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

News

Posted on 2026-06-28 15:38:04

Share: Share


కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

కామారెడ్డి జిల్లాలోని అర్హులైన ఐదేళ్లలోపు 1,03,678 మంది చిన్నారులందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయాలి – ఒక్క చిన్నారి కూడా మిగిలిపోరాదు

డైలీ భారత్, కామారెడ్డి: జాతీయ పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రత్యేక అధికారి, జాయింట్ డైరెక్టర్ డా. వెంకటరమణ ఆదివారం కామారెడ్డి జిల్లాను సందర్శించారు.

ఈ సందర్భంగా బికనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పల్స్ పోలియో బూత్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. వెంకటరమణ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాలో పోలియో చుక్కలకు అర్హులైన ఐదేళ్లలోపు  మొత్తం 1,03,678 మంది చిన్నారులు ఉన్నారని, వారందరికీ 100 శాతం పల్స్ పోలియో చుక్కలు వేయడం ఆరోగ్య శాఖ మనందరి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోకుండా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఎం.పీ.హెచ్.ఏలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. జె.వెంకటి గారు మాట్లాడుతూ జిల్లాలోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని అలాగే రెండవ, మూడవ రోజు ఆశా కార్యకర్తలు, అంగన్వాడీకార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సందర్శన చేసి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగిలిపోయారా అని ఆరా తీసి ఎవరైనా ఐదు సంవత్సరాల లోపు పిల్లలు  పోలియో చుక్కలు వేయించుకోకుండా ఉంటే పోలియో రెండు చుక్కలు వేసి అనంతరం ప్రతి ఇంటికి ఎక్స్ (X)  పి (P) మార్క్ తప్పకుండా వేయాలని ఆదేశించారు. అలాగే ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలు, మైగ్రేషన్ ప్రజలు, ప్రాజెక్టులు లాంటి ప్రత్యేక ప్రాంతాలను సందర్శించి అక్కడ ఐదు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారా లేరా కనుగొని ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాల్సిందిగా ఆదేశించారు. మరియు పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్ కుమార్,చలపతి,వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >