| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

News

Posted on 2026-03-13 14:49:09

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

ఫోన్‌పే, పేటీఎం ద్వారా రూ.18 లక్షలకు పైగా మోసం

దోచుకున్న డబ్బులతో cricbet99 బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడులు.

డైలీ భారత్, వేములవాడ: గంగాధర మండలం ఓద్యారం గ్రామానికి చెందిన సత్పది సాయితరుణ్ (27), స్వగ్రామంలోని వెంకటేశ్వర దేవాలయంలో పూజారిగా పని చేస్తూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోవడంతో, మళ్లీ బెట్టింగ్ ఆడేందుకు సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

అందులో భాగంగా వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన చెన్నమాధవుని రామరాజు (రిటైర్డ్ MEO) ప్రతిరోజు వాకింగ్ కోసం ఓద్యారం గ్రామానికి వచ్చేవాడు.ఈ పరిచయాన్ని ఉపయోగించుకున్న సాయితరుణ్, రామరాజుతో స్నేహం పెంచుకుని అతని దగ్గర డబ్బులు కాజేయాలనుకొని, ఒకరోజు రామరాజు ఇంటికి వెళ్లి,అతని మొబైల్‌లో PhonePe, Paytm అప్లికేషన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పి కొత్త పిన్ నంబర్లు సెట్ చేస్తానని నమ్మబలికాడు.తనకు గుర్తుండేలా పిన్ నంబర్లు మార్చడు.

ఆతరువాత రామరాజు తిరుపతికి దర్శనానికి వెళ్లాలని చెప్పడంతో, దర్శన టికెట్లు మరియు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి అతని మొబైల్ తీసుకున్నాడు. అలా రామరాజుకు తెలియకుండా అతని PhonePe, Paytm ద్వారా విడతల వారీగా మొత్తం రూ.18,46,885/- ను ఇల్లంతకుంట మండలం నరసక్కపేట గ్రామానికి చెందిన ధామేర హరీష్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు.

తర్వాత ఆ డబ్బులను హరీష్ ద్వారా cricbet99 అనే బెట్టింగ్ యాప్‌లో సాయితరుణ్ ఐడీలకు ట్రాన్స్ఫర్ చేయించి బెట్టింగ్ ఆడాడు.ఇందుకు ప్రతిగా హరీష్‌కు కమిషన్ రూపంలో దాదాపు రూ.1 లక్ష ఇచ్చాడు. అయితే ఆ మొత్తం డబ్బు కూడా బెట్టింగ్‌లో పోయింది.

రామరాజు టికెట్ల గురించి అడిగినప్పుడల్లా సాయితరుణ్ వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వచ్చాడు. చివరకు మోసపోయానని గ్రహించిన రామరాజు బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై బోయినపల్లి ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేశారు.

తదుపరి వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు, ఈ క్రమంలో నిందితుడు కొంతకాలం ఉత్తరప్రదేశ్‌లోని దేవాలయాలకు వెళ్లి అక్కడే ఉండి, తరువాత తిరిగి ఓద్యారం వచ్చి  హరీష్‌ను ఫోన్ చేసి వెంకట్రావుపల్లి గ్రామంలోని రాజన్న హోటల్ వద్దకు రమ్మనగా సాంకేతికత ఆధారంగా వేములవాడ రూరల్ CI శ్రీనివాస్ సాయి తరుణ్, హరీష్ లను అరెస్ట్ చెసి వారి వద్ద నుండి రెండు మొబైల్ ఫోన్లు , నగదు 80,000 నగదు స్వాధీన పర్చుకొని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు.

అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఫోన్‌పే, పేటీఎం వంటి డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన పిన్ నంబర్లు, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ సూచించారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >