| Daily భారత్
Logo




వలపు వల... దంపతుల ఎర

News

Posted on 2026-01-15 08:45:32

Share: Share


వలపు వల... దంపతుల ఎర

సోషల్ మీడియా వేదికకగా బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్యాభర్తల బాగోతాన్ని బట్టబయలు చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు.

డైలీ భారత్, కరీంనగర్: గత రెండు సంవత్సరాల నుండి కరీంనగర్ రూరల్ మండలంలోని ఆరేపల్లి లో గల శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లోని ఒక ఫ్లాట్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇంస్టాగ్రామ్ లో తమ ఫోటోలను పెట్టుచు అట్టి ఫోనులో ఆమె పోస్టులు పెట్టుచు వాటిని చూసి కొంతమంది వ్యక్తులు చూసి ఆమెను ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతూ ఆమె నెంబరు తీసుకొని ఆమెను సంప్రదించగా డబ్బులు తీసుకొని రావాలని అయితేనే సెక్స్లో పాల్గొంటానని తన అడ్రస్ తెలుపగా దాదాపు 100 మంది వరకు కరీంనగర్ మరియు చుట్టూ ప్రక్కన ఏరియాలో నుండి కొందరు బడా వ్యాపారస్తులు మరియు యువకులు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కు వచ్చి ఆమె భర్త అనుమతితో ఆమెతో వారు సెక్స్లో పాల్గొంటూ డబ్బులు ఇచ్చేవారు వారు సెక్స్లో పాల్గొన్న సమయంలో నగ్నంగా ఉన్నప్పుడు తన భర్త ఫోన్లో వీడియో రికార్డు చేసేవారు వారు ఇచ్చిన డబ్బులతో అపార్ట్మెంట్ ఈఎంఐ లోన్ కట్టేవారు మరియు ఒక టాటా కారు కొనుక్కొని దర్జాగా తిరుగుచుండేవారు వారి అపార్ట్మెంట్లో ఏసీలు సోఫా సెట్లు విలువైన బెడ్స్ కూడా ఉన్నవి మరియు వారు వారి దగ్గరకు వచ్చిన వారిని మీరు నగ్నంగా ఉన్న వీడియోలు మా దగ్గర ఉన్నవి, వాటిని వైరల్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు నగ్నంగా ఉన్న ఫోటోలు బయటపడితే పరువు పోతదని కొంతమంది పలుకుబడి ఉన్న వ్యక్తులు భయపడి ఇచ్చుచుండడి వారు ఒక సంవత్సరం కింద పరిచయమైన కరీంనగర్ కు చెందిన వ్యక్తి వారికి బాగా చనువుగా ఉండి ఆమె భర్తతో మందు త్రాగుతూ ఆమెతో ఎక్కువసార్లు సెక్స్లో పాల్గొనుచుండగా అతనికి మాయ మాటలు చెప్పి వారి అపార్ట్మెంట్ లోనులు మరియు కారు ఇఎంఐలు అతనితోనే కట్టించేవారు చివరకు అతని వద్ద డబ్బులు అయిపోయి కొన్ని రోజులు రాకపోగా  అతనికి వాట్సాప్ కాల్స్ చేసి నీవు ఎందుకు రావడం లేదని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు ఇక నన్ను మర్చిపోండి అని చెప్పగా వారిద్దరూ భార్యాభర్తలు అట్టి వ్యక్తిని మాకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వు నిన్ను మర్చిపోతాము అతనికి చెప్పగా అతడు నా వద్ద డబ్బులు లేవని చెప్పగా వారు అంతటితో ఆగక నీవు 5 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వకపోతే నీ వీడియోలు మీ ఇంట్లో వారికి పంపుతామని అప్పటికీ నీవు ఇవ్వకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించినారు అతడు చంపుతారని భయపడి ఒక లక్ష రూపాయలు ఇస్తానని అనుకొని వాటిని తీసుకొని ఒంటరిగా వారి ఇంటికి పోయి ఇస్తానని శ్రీపురం కాలనీ బోర్డు వద్ద రాపిడో బుక్ చేయడానికి ఉండగా అప్పుడే తనను బెదిరించిన ఇద్దరు భార్యాభర్తలు వారి కారులో అట్టివ్యక్తి ఇంటికి వెళదామని రాగా అతడు కనపడగా అతనిని పిలిచి డబ్బులు ఇస్తావా లేదా లేకపోతే నిన్ను ఎలాగైనా చంపుతామని బెదిరించగా సదరు వ్యక్తి చంపుతారేమో అని భయపడి తన వద్ద ఒక లక్ష రూపాయలు ఉన్నావని అవివారికి ఇచ్చి మిగతా నాలుగు లక్షలు రెండు రోజుల్లో పంపిస్తామని ఇంతవరకు దాదాపు మీకు 14 లక్షల రూపాయల వరకు ఇచ్చానని నన్ను ఏమి చేయవద్దని వీడియోలను తీసివేయాలని వేడుకోగా వారు 4 లక్షలు ఇవ్వకపోతే తప్పకుండా వీడియోలు బయటపెట్టి నిన్ను ఏదో విధంగా చంపుతామని బెదిరించి వెళ్ళిపోయినారు సదరు వ్యక్తి భయపడుకుంటూ తన బంధువులకు మిత్రులకు జరిగిన మొత్తం విషయాన్ని చెప్పగా వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పగా అతడు పోలీస్ స్టేషన్కు నిన్న అనగా 13.01.2026 న ఫిర్యాదు చేసి తాను వారికి ఇచ్చిన డబ్బులు ఫోన్ పే ద్వారా పంపానని చూపించగా పోలీస్ స్టేషన్లో భార్య భర్తల ఇద్దరిపై కేసు నమోదు చేయనైనది నేరస్తుల గురించి ఏసిపి విజయ్ కుమార్ ఆదేశానుసారం సిఐ నిరంజన్ రెడ్డి మరియు ఎస్ఐలు సిబ్బందితో రెండు గ్రూపులుగా గాలిస్తుండగా ఈరోజు ఉదయం 8 సమయమున వారిద్దరు వారి కారు నడుపుకుంటూ వచ్చుచూ టేస్టీ దాబా వద్ద ఆగి ఫోన్ మాట్లాడుతుండగా అనుమానంతో వారిని పట్టుకొని విచారించగా వారు జరిగిన విషయం మొత్తం చెప్పి నేరమును ఒప్పుకొని వారు కొన్న కారును వారు నగ్నంగా ఉన్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్ లను వారి వద్ద ఉన్న ఫిర్యాదు ఇచ్చిన చెక్కును చూపించగా వాటిని స్వాధీన పరుచుకొని పీఎస్ కు తీసుకొని వచ్చి వారిని రిమాండ్ నిమిత్తం తదుపరి చర్య నిమిత్తం మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరచగా వారిని 14 రోజుల నిమిత్తం జైలుకు తరలించామని ఆదేశాలు ఇవ్వగా వారిని ఎస్కార్టులుగా తీసుకొని పోయి జైలులో అప్పగించినది - నేరస్తులైన భార్యాభర్తలది మంచిర్యాల జిల్లా  వీరికి ఒక కుమారుడు మరియు కూతురు ఉన్నారు, గత కొంతకాలంగా కరీంనగర్లో ఉంటూ ఈ వ్యవహారం జరుపుతున్నారు. మరియు ఇట్టి కేసును 24 గంటల లోపు ఛేదించి పట్టుకున్నందుకు  గాను  కరీంనగర్ రూరల్ సిబ్బంది ని కరీంనగర్ రూరల్ ఏసిపి విజయ్ కుమార్  అభినందించారు.

Image 1

వలపు వల... దంపతుల ఎర

Posted On 2026-01-15 08:45:32

Readmore >
Image 1

బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-15 06:39:17

Readmore >
Image 1

విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త

Posted On 2026-01-14 22:44:54

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు

Posted On 2026-01-14 18:45:43

Readmore >
Image 1

పోలింగ్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-01-14 17:46:55

Readmore >
Image 1

ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-01-14 17:45:54

Readmore >
Image 1

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

Posted On 2026-01-14 17:44:56

Readmore >
Image 1

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-01-14 17:43:41

Readmore >
Image 1

గల్ఫ్ మృతదేహం తరలింపు... ఖర్చు భరించిన రాష్ట్ర ప్రభుత్వం

Posted On 2026-01-14 17:39:34

Readmore >
Image 1

బ్యాగ్‌ బరువు ఉండదక్కడ

Posted On 2026-01-14 15:26:21

Readmore >