| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీబీపేటలో ఫోర్‌లేన్ రోడ్డు ఏర్పాటు చేయాలి : ప్రభుత్వానికి కొరివి నర్సింలు డిమాండ్

బీబీపేటలో ఫోర్‌లేన్ రోడ్డు ఏర్పాటు చేయాలి : ప్రభుత్వానికి కొరివి నర్సింలు డిమాండ్

డైలీ భారత్, బీబీపేట: బీబీపేట మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్, అధ్వానంగా ఉన్న రహదారులతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజా మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త కొరివి నర్సింలు ముదిరాజ్ అన్నారు.

గురువారం ఉదయం 11.30 గంటలకు మండల కేంద్రంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారిపై కంకర రాళ్లు ఉండటంతో, పక్కకు వెళ్లేందుకు స్థలం లేకపోవడంతో ప్రమాదాల ముప్పు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

డాబా బంగ్లా నుంచి హెచ్‌పీ పెట్రోల్ బంక్ వరకు రహదారిని విస్తరించి ఫోర్‌లేన్‌గా అభివృద్ధి చేయాలని, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై ఉన్న బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

మారుమూల ప్రాంతమైన బీబీపేట అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికల సమయంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Previous అక్టోబర్ 2న కామారెడ్డిలో కిసాన్ ఫ్యాషన్ మాల్ పునఃప్రారంభం...
Next "ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి" : మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సైకాలజిస్ట్ పున్నంచందర్
ADVERTISEMENT