Posted on 2026-01-15 06:39:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామంలో నిర్వహించిన బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బుధవారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త నగదుతో పాటు బహుమతులు ప్రదానం చేశారు.విజేత జట్టు ముంబై ఇండియన్స్ పది వేల రూపాయలు,రన్నర్ అప్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని, చదువుతోపాటు ఆటలను దైనందిన జీవితంలో ఏర్పరుచుకోవాలని అన్నారు.క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అందుకే రోజు మొబైల్ గేమ్స్ ను మానేసి,ఫిజికల్ గేమ్స్ ఆడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, మదన్ కుమార్,నాగరాజు, శ్రీనివాస్ గౌడ్,అమర్నాథ్ రెడ్డీ, వార్డు సభ్యులు వీరేశం,రాజేష్ నాయక్,ప్రశాంత్ గౌడ్,శ్రీశైలం యాదవ్,యాదయ్య క్రీడాకారులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >