Posted on 2026-03-07 16:52:31
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలo నియోజకవర్గం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహరాజ్ నిర్వాహణ కమిటీ భూక్యా రంగా అధ్యక్షతన అధికారికంగా జరిగిన సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భోగ్ భండారో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,టిజిటిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, జి ఎల్ ఎస్ జేఏసీ చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ బాల బ్రహ్మచారి ,శివ అవతారి కలియుగంలో పుట్టిన యుగ పురుషుడని అన్నారు.
యావత్ భారత దేశంలో సుమారు 15 కోట్ల బంజారా జాతి బిడ్డలు ఆరాధించే ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు.
సేవాలాల్ మహరాజ్ తండలో ఏర్పాటు చేసిన నాయక్,కార్బారీ వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారే చెప్పుకొచ్చారని,రాజ్యాంగం రాసే సమయంలో తండా నాయక్, కార్భారి వ్యవస్థను పరిశీలించే ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు.మద్దిమడుగుతో పాటు రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో 10 ఎకరాల విస్తీర్ణంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గుడి నిర్మాణం చేపట్టాలని కోరారు.
లంబాడీ జనాబా అత్యధికం ఉన్న జిల్లా కేంద్రాలలో సుమారు 5 ఎకరాలలో గుడి నిర్మాణం చేపట్టాలని కోరారు.
రాష్ట్ర సచివాలయం ముందు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని,కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు కూడా విగ్రహ ఏర్పాటు చేసేలా పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు.
15 కోట్ల మంది మాట్లాడే గోర్ బోలి భాషను కేంద్ర ప్రభుత్వం 8 వ షెడ్యూల్ లో చేర్చాలని కోరారు.షెడ్యూల్ ఏరియా ప్రాంత గిరిజనుల కోసం జిఓ 3 స్థానంలో ప్రత్యక జిఓ ను తెచ్చేలా అసెంబ్లీ తీర్మానo చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం జడ్జి శివ నాయక్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి గన్యా నాయక్,DD అశోక్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ధర్మ గురు పూజారి బానోత్ భోజ్యా నాయక్,తేజావత్ మోహన్ లాల్,బాదావత్ గోవింద్,GLS JAC సెక్రటరీ జనరల్ రమేష్ నాయక్,వైస్ చైర్మన్ లావుడ్య ప్రసాద్,మోహన్, సైదులు,ప్రతాప్ సింగ్,రాంచందర్, రామకృష్ణ,కౌశిక్ నాయక్,రంజిత్,బిచ్చ నాయక్, రామదాస్, బన్సీలాల్,సీతారాం,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >