| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

ఆల్ప్రాజోలామ్ మత్తు పదార్థంతో కల్తీ చేసిన 60 కల్లు సీసాలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్

డైలీ భారత్, కామారెడ్డి: విశ్వసనీయ సమాచారం మేరకు 05-08-2026న తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరడ్‌పల్లి గ్రామంలో ఉన్న ఓ కల్లు దుకాణంపై తాడ్వాయి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కల్లు విక్రేత సీతూరి @ గౌండ్ల పోచగౌడ్ (50)ను అదుపులోకి తీసుకుని దుకాణాన్ని పరిశీలించగా, వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో కల్లులో ఆల్ప్రాజోలామ్ (Alprazolam) అనే సైకోట్రోపిక్ మత్తు పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజెపైన్ (Benzodiazepines) పాజిటివ్‌గా తేలింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కూడా వారికి BZO (Benzodiazepines) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దర్యాప్తును మరింత విస్తరించిన పోలీసులు, కల్లు దుకాణం లైసెన్స్ హోల్డర్ కొండాపురం స్వామిగౌడ్ (36)ను 06-08-2026న అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అక్రమ లాభాల కోసం కల్లులో ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయించినట్లు నిర్ధారణ అయింది.

ఈ కేసులో 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లుతో పాటు ఇతర సంబంధిత ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి

మత్తు పదార్థాలు కలిపిన ఆహార పదార్థాలు లేదా పానీయాల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు తెలియజేయాలని కామారెడ్డి జిల్లా పోలీసులు ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై మరింత కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

Previous పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ
Next నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి
ADVERTISEMENT