| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

డైలీ భారత్, స్పెషల్: 

నేతన్న నెత్తుటి నూలు... 

మగ్గం మోగితే మన సంస్కృతి మేల్కొంటుంది...

కానీ ఆ ఇంట్లో నవ్వులు మోగడం లేదు..!

నూలు కదిలితే నవభారత కీర్తి ముందుకు సాగుతోంది...

కానీ ఆ కుటుంబం బతుకు ముందుకు సాగడం లేదు..!

చెమటను అద్భుత డిజైన్లతో చీరలో మలిచినాడు..!

కన్నీటిని కనురెప్పల మాటున దాచుకుంటున్నాడు..!

అతడు అల్లిన పట్టు...

ఉన్నవారి ఇంట పసిడి నవ్వవుతుంది..!

తన ఇంట మాత్రం చినిగిన చీర

దర్శనము ఇస్తున్నది..!

దేశం అతని కళను కొనియాడుతుంది

కానీ.. కళకు తగిన ప్రతిఫలం లేక

అన్నం గిన్నె అటుకు ఎక్కి అలిగింది..!

అతడు అల్లిన చీరకు కాలి చప్పట్లు జేజేలు... అందుకే అతని కూతురి పెళ్లి  అప్పుల ముసుగులోనే ఆగిపోయింది..!

కళను కాపాడిన కర్మయోగి నేతన్న,

కలలను నేసిన కవియోగి నేతన్న,

అందుకే నేతన్నను కాపాడుకుందాం 

జాతీయ చేనేత దినోత్సవాన్ని గర్వంగా జరుపుదాం.


రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Next భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...
ADVERTISEMENT