| Daily భారత్
Logo




మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

News

Posted on 2026-03-07 16:54:13

Share: Share


మహిళల సాధికారతే సమాజ ప్రగతికి బలమైన పునాది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని మహిళలకు కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, టిబిజికెఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సమాజ నిర్మాణంలో కీలకమైన స్థానం సంపాదించుకున్నారని, కుటుంబ వ్యవస్థను బలపరచడంలోనే కాకుండా దేశ అభివృద్ధి పథంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ తమ ప్రతిభను నిరూపించుకుంటుండటం గర్వకారణమని అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు విద్య, వైద్యం, రాజకీయాలు, పరిపాలన, క్రీడలు, వ్యాపార రంగాల్లో విశేష విజయాలు సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. కష్టాలను అధిగమిస్తూ మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు మాటలకు పరిమితం కాకుండా మరింత ఫలప్రదంగా అమలవ్వాలని, అవి మహిళల ఆర్థిక, సామాజిక స్థితిని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

మహిళలకు సమాన హక్కులు, గౌరవం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వివక్ష పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు సాగి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించాలని, తమ లక్ష్యాలను సాధిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని పిలుపునిస్తూ జిల్లాలోని మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల అభివృద్ధి, గౌరవం, సమానత్వం సాధించడానికి సమాజం మొత్తం కలిసికట్టుగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >