Posted on 2026-03-07 21:33:43
ఖమ్మం నగరంలోని నిజాంపేట్ ప్రాంతంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
డైలీ భారత్, ఖమ్మం: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఖజూర్ పండును తినిపిస్తూ ఇఫ్తార్ విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.మత సామరస్యాన్ని కాపాడుతూ అందరం కలిసి ముందుకు సాగితేనే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు.అల్లా దయ అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని,రాష్ట్ర ప్రజలు మరియు ఖమ్మం ప్రజలు సుఖసంతోషాలతో,సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం అల్లా అనుగ్రహంతో మరింత శుభాలు, శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు.అదే విధంగా KCR నాయకత్వంలోని BRS ప్రభుత్వ కాలంలో రంజాన్ సందర్భంగా అందించిన రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ఆయన గుర్తు చేశారు. నిరుపేద ముస్లింలకు ఆ సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే విధంగా రంజాన్ తోఫాను అర్హులైన పేదలకు అందించేలా చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనంతరం ఖమ్మం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో మహమ్మద్ నజీముద్దీన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అక్కడి స్థానిక నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలిపుకున్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ మక్బుల్,జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్, టౌన్ మైనారిటీ అధ్యక్షుడు షంసుద్దీన్,మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, నజీముద్దీన్,ముజాహిద్,పాషా,జవాద్,అజాంచోటు,తౌసిఫ్,షబ్బీర్,మున్నా,చంటి,అజీమ్,గురుమూర్తి,ఇజారుద్దీన్,మైనార్టీనాయకులు,కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >
కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారే దిశగా అడుగులు వేస్తుంది.. ఇది తెలంగాణకే గర్వకారణం
Posted On 2026-06-04 15:58:25
Readmore >
ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన అజెండా : మద్దిశెట్టి సామేలు
Posted On 2026-06-04 15:52:23
Readmore >