Posted on 2026-03-07 13:44:07
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా బంజారా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మొహమ్మద్, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచారని, ఆయన బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
బంజారా సమాజం సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా బంజారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం బంజారా మహోత్సవాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బంజారా సంఘ నాయకులు, బంజారా సోదరులు, సోదరీమణులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >