| Daily భారత్
Logo




హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

News

Posted on 2026-03-07 13:42:44

Share: Share


హామీలు నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

చిన్న మల్లారెడ్డిలో హామీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం – దళిత కుటుంబాలకు “ఇందిరమ్మ ఇల్లు” గృహప్రవేశం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ దళిత కుటుంబాలకు “ఇందిరమ్మ ఇల్లు” నిర్మించి గృహప్రవేశం నిర్వహించడం జరిగింది.

గతంలో 18-03-2023న, అప్పటి టీపీసీసీ అధ్యక్షులు  ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా కామారెడ్డి నుండి రాజంపేట్ వరకు నిర్వహించిన పాదయాత్ర సమయంలో చిన్న మల్లారెడ్డి గ్రామంలోని హరిజనవాడలో నివసిస్తున్న దళిత కుటుంబాలకు చెందిన బిక్నూర్ లక్ష్మి మరియు రాజమణి గారి ఇళ్లను పరిశీలించారు. ఆ సమయంలో వారి ఇళ్లు శిధిలావస్థలో ఉండటాన్ని గమనించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీని నిలబెట్టుకుంటూ, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పథకం ద్వారా వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి, నిత్యావసర సామగ్రిని కూడా అందజేసి గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందనే విషయానికి ఇది నిదర్శనమని తెలిపారు. దళిత కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >