| Daily భారత్
Logo




తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ... రైతులపై దాడి చేసిన పోలీసులు!!

News

Posted on 2025-02-21 13:13:30

Share: Share


తాళ్లతో కట్టేసి బూటు కాళ్లతో తన్నుతూ... రైతులపై దాడి చేసిన పోలీసులు!!

అటవీ భూములను సాగు చేస్తున్నారని దాడి!

డైలీ భారత్, భూపాలపల్లి డెస్క్:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు. ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి, బూటు కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు.

తాత ముత్తాతల నుంచి 11 మంది రైతులం 25 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నామని, ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలిసి కూడా వచ్చి దాడి చేశారని... నిన్న జిల్లా ఆటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి 150 మంది పోలీసులతో వచ్చి తమను బూటు కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దారని.. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన మహిళా రైతులు తెలిపారు.

కొండి శారద, పొదిళ్ల శ్రీను, పొదిల్లా రజిత అనే రైతులను తాళ్లతో కట్టేసి అధికారులు వారి వాహనాల్లో తీసుకువెళ్ళారు. వారి ఆచూకీ తెలిపి, గత నాలుగేండ్లుగా తమ దగ్గర దాదాపు 5లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటూనే, తమ కొడుకులపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు

Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >
Image 1

చలానా కాదు.. రాఖీతో రోడ్డు భద్రతపై అవగాహన!

Posted On 2026-08-28 08:06:13

Readmore >
Image 1

ఒక ప్రత్యేకమైన వాగ్దానం కారణంగా కట్టబడిన తొలి రాఖీ

Posted On 2026-08-28 07:11:25

Readmore >