| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

డైలీ భారత్, ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరు నుండి జొన్నాడ వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుపై మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శరవణ ఫైబర్స్ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో మండపేట, కొత్తపేట ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. మంటలు చెలరేగిన సమయంలో రహదారి పైకి పొగలు భారీగా అలుము కోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 

మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఫైర్ సిబ్బంది, యజమాని మురళీకృష్ణ తెలిపారు. సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనాలు వేశారు. 

అయితే ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Previous గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్తరైలు
Next ఏసీబీ వలలో ఎస్ఐ
ADVERTISEMENT