| Daily భారత్
Logo




పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

News

Posted on 2026-08-25 17:42:46

Share: Share


పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS

డైలీ భారత్, కామారెడ్డి:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

“మొక్క నాటడం మాత్రమే కాదు.. దానిని సంరక్షించడం కూడా మన బాధ్యత” అని ఎస్పీ పేర్కొన్నారు. వనమహోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తే పచ్చని కామారెడ్డిని నిర్మించవచ్చని ఎస్పీ తెలిపారు. మొక్కలను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కే. నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, ఆర్‌ఐలు సంతోష్ కుమార్, నవీన్, కృష్ణ, ఆర్‌ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >