| Daily భారత్
Logo




రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

News

Posted on 2026-08-24 14:33:25

Share: Share


రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటంలో విజయం సాధించి పెట్టిన కేసులన్నీ రాజకీయ కుట్రతో పెట్టినవని హైకోర్టు కేసు కొట్టేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఘనంగా స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజానీకం...

ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ

ఒక మహిళను అడ్డుపెట్టుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైనది కాదు అని హెచ్చరించారు..లైంగిక వేధింపుల కేసు వల్ల తన కుటుంబం ఎంతగానో మనస్తాపం అనుభవించిందని, కానీ నిజం గెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామన్నారు.పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు చూపిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు..నాపై నమోదుచేసిన కేసు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగమేనని నేను మొదట్నుంచే చెబుతున్నాను.నిజం న్యాయం మీద ఉన్న విశ్వాసంతోనే న్యాయపోరాటం చేశాను, చివరకు సత్యమే గెలిచింది. ప్రజల ఆశీర్వాదం,పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందించిన అండతో ఈ పోరాటంలో నిలబడగలిగాను.రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు,కానీ తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి మంచి కాదు.ఇకపై ప్రజాసేవకే మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని అన్నారు.ఇలాంటి అక్రమ కేసులకు భయపడే పరిస్థితి లేదని అన్నారు...కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు 420 లో హామీలు ఇచ్చి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ప్రజలను అనేక ఇబ్బందులను గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు...ఇప్పటినుంచి మరింత ఉత్సాహంతో ప్రభుత్వానికి ప్రతి క్షణం వారు ఇచ్చిన హామీలపై గుర్తు చేస్తూ ధర్నాలు పోరాటాలు సాగిస్తూ ప్రజల పక్షాన నిలబడతామని సూచించారు..ఇకనైనా ప్రభుత్వం నిద్ర వీడి ఇలాంటి అక్రమ కేసులు కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన అన్నారు..

కల్యాణలక్ష్మి నిధులను వెంటనే విడుదల చేయాలి

హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం సరికాదు

పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. తొలుత రూ.50 వేలతో ప్రారంభించిన ఈ పథకాన్ని అనంతరం రూ.1,00,116కు పెంచి పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలులో జాప్యం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో నిధులు అందక పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

హైకోర్టు అంశంపై ప్రభుత్వం స్పందించాలి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయకపోవడం వల్ల సమస్య మరింత జాప్యమవుతోందని రేగా కాంతారావు గారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేసి, అర్హులైన పేదలకు పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం వ్యవహరించాలని, పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సాయం అందించాలని కోరారు...ప్రభుత్వం వెంటనే స్పందించి కల్యాణలక్ష్మి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల తరఫున బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు...

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >