Posted on 2026-08-24 14:16:01
డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి
టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ కి దగ్గరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు ఉన్నాయని,ఆ భూములలో విద్యాసంస్థల ఏర్పాటు చేసి అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సాంకేతికపరమైన విద్యాసంస్థలు లేక ఇప్పటికే కామారెడ్డి వెనుకబడిపోయిందని ఏటీసీ సెంటర్ ను కూడా భిక్కనూరులో కాకుండా కామారెడ్డి లో ఏర్పాటు చేస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరు విద్యార్థులకు ఉపయోగపడుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రంలోనే విద్యాసంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
భిక్కనూరు మండలంలో ఫార్మా కంపెనీల వలన ఎన్నో ఇబ్బందులను చాల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారని, రాబోయే రోజుల్లో తాగే నీరు,పీల్చే గాలి,భూములు కాలుష్యం అయిపోయి ప్రజలు గ్రామాలను విడిచి పెట్టే పరిస్థితులు రానున్నాయని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్న డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేసినట్లయితే కామారెడ్డి జిల్లా కేంద్రం అభివృద్ధితో పాటుగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి పర్యటనలో ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తానని డిగ్రీ కళాశాల భూములలో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తానని మోసం చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఈ భూములలో విద్యాసంస్థల ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >