Posted on 2026-08-24 14:24:34
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ కస్టమ్ మిల్లింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.7.55 కోట్లు ఎగ్గొట్టిన కేసులో ఇద్దరు రైస్ మిల్లర్లను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (TGSCSCL) రాజన్న సిరిసిల్ల జిల్లా విభాగం, ఖరీఫ్ 2021-22 నుండి ఖరీఫ్ 2024-25 వరకు 5 సీజన్లకు సంబంధించి 8,447.138 మెట్రిక్ టన్నుల వడ్లను వేములవాడ మండలం కోనాయిపల్లిలోని M/s అంజనేయ ట్రేడర్స్ @ కన్యకా పరమేశ్వరి రైస్ మిల్ (కోడ్: 176267) కు అప్పగించింది.
ఒప్పందం ప్రకారం మిల్లు నిర్వాహకులు 5,659.582 MTs CMR బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్లకు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 3,167.605 MTs మాత్రమే ఇచ్చారు. 2,491.977 MTs బియ్యాన్ని పక్కదారి పట్టించారు.
పెండింగ్ పై 25% పెనాల్టీతో కలిపి 3,114.972 MTs ఇవ్వాల్సి ఉండగా, అందులో కూడా 879.131 MTs మాత్రమే ఇచ్చి, ఇంకా 2,235.841 MTs బకాయి పెట్టారు. దీని విలువ సుమారు రూ. 7,55,71,688/-
TGSCSCL డిస్ట్రిక్ట్ మేనేజర్ జి.గోపాల్ ఫిర్యాదుతో వేములవాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వేములవాడ SDPO A. శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న 5 మందిలో
A1 చేపూరి అంజయ్య (సిరిసిల్ల), A5 లోపెల్లి వెంకటేశ్వర్ రావు (సిరిసిల్ల) లను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.
మిగిలిన నిందితులు ఆచం సంతోష్, దొంతుల గణేష్, చేపూరి మధుకర్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >