Posted on 2026-08-24 14:09:34
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:జిల్లా పర్యటనకు విచ్చేసిన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) సభ్యులు జాతోత్ హుస్సేన్‌కు సింగరేణి గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ పూల మొక్కను అందించి సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. జిల్లాలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, గిరిజనులకు మెరుగైన మౌలిక వసతులు, విద్య, వైద్యం తదితర రంగాల్లో అందిస్తున్న సేవలపై అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >
జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్ హుస్సేన్‌కు కలెక్టర్ అంకిత్ ఘన స్వాగతం
Posted On 2026-08-24 14:09:34
Readmore >