| Daily భారత్
Logo




వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

News

Posted on 2026-08-24 15:21:21

Share: Share


వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

డైలీ భారత్, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం -2026 కార్యక్రమంలో భాగంగా కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రి ఛాంబర్ నుండి, హైదరాబాద్ నుండి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులతో వనమహోత్సవం- 2026 లక్ష్యసాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి మాట్లాడుతూ భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందని, కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో కృషి చేసి మొక్కలు నాటి సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. లోటు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయామని, ఇక నుండి కురిసే వర్షాల నీటిని ఒడిసిపట్టి, నిల్వచేసి సెప్టెంబర్ చివరి వారం లోగా 100 శాతం లక్ష్యాలను సాధించాలని తెలిపారు. అటవీ శాఖ నర్సరీలలో తగినన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయని, గుర్తించబడిన ప్రాంతాలలో ఎంపిక చేసిన మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షణ కూడా చేపట్టాలని, నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలని, పశువులు, జంతువుల నుండి కాపాడేందుకు నాటిన మొక్కలకు ట్రీగార్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అర్బన్ ఫారెస్ట్ లలో విరివిగా మొక్కలు నాటాలని, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేయాలని, దేవాలయాల ప్రాంగణాలలో ప్రత్యేకమైన ఎంపిక చేసిన మొక్కలను నాటేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేయాలని తెలిపారు. వన మహోత్సవం లక్ష్యాలను పూర్తి చేయడంలో భాగంగా ప్రజలందరికీ తెలిసే విధంగా మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.


జిల్లా కలెక్టర్ కుమార్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో వనమహోత్సవం- 2026 లో భాగంగా 24.66.లక్షల మొక్కలను లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 17.78 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, నిర్ణీత గడువులోగా 100 శాతం లక్ష్యాలను సాధించే దిశగా అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దామోదర్ రెడ్డి, అదనపు స్థానిక సంస్థలు కలెక్టర్ NY గిరి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >