Posted on 2026-08-25 17:40:44
విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు
టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్
డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మరియు ఏటిసి (అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్స్ ను) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు,టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కంబాల లక్ష్మణ్ యాదవ్,విద్యార్థి జిల్లా అధ్యక్షుడు వినయ్ లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలు టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బాలు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ లు మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మరియు ఏటీసీ విద్య సంస్థలను కామారెడ్డి డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని,రవాణా సదుపాయాలు,మౌలిక వసతులు లేని చోట వీటిని ఏర్పాటు చేస్తే వాటి లక్ష్యం దెబ్బతింటుందని ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయడానికి డిగ్రీ కళాశాల భూములు రిజిస్ట్రేషన్ కాలేదని ఇప్పుడు కళాశాల పేరు మీద భూములు ఉన్నప్పటికీ దూర ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతులు విద్య సంస్థలు ఏర్పాటు కావాలని ఇచ్చిన భూములను నిరుపయోగంగా ఉంచి విద్యార్థులకు నష్టం చేస్తున్నారని అన్నారు. విద్యాసంస్థలు జిల్లా కేంద్రానికి వచ్చేంతవరకు పోరాటం చేస్తామని దానికి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించాలని లేకపోతే నిరవధిక దీక్షలను చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు వినయ్ రాజు సందీప్ సతీష్ మధు రాహుల్ నవనీత్ లు పాల్గొనడం జరిగింది.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >