డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గులాబీ శ్రేణులు దీక్ష దివస్ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదం తో 2009 నవంబర్ 29 న దీక్ష దివస్ చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఐతే తెలంగాణ ఉద్యమం కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని ముక్యంగా ఉద్యగ, విద్యార్థుల ధర్నాలు అలాగే రైలు రోకో, వంట వార్పు వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టిన కెసిఆర్ చేపట్టిన దీక్ష దివస్ కు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.
News
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్ష దివస్