| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వరి చేలల్లో వ్యర్థాలను తగలబెట్టవద్దు! రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి!

వరి చేలల్లో వ్యర్థాలను తగలబెట్టవద్దు! రైతులకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి!

పంట వ్యర్థాలు కాల్చితే తీవ్ర వాయు కాలుష్యం!

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు పొగ కారణం!

నేలలోని సూక్ష్మ పోషకాలు నాశనం అవుతున్నాయి!

వ్యర్థాలను భూమిలో కలియుదున్నితే నేల బలం పెరుగుతుంది!

డైలీ భారత్, ఏలూరు:వరి పంట కోసిన తర్వాత వ్యర్థాలను కాల్చడం వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. దీనిపై రైతులను ఉద్దేశించి మీడియాకు విడుదల చేసిన సందేశంలో ఎంపీ మాట్లాడారు.

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలిలోకి విడుదలై, తీవ్రమైన వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, కళ్ళ మంటలు, గుండె సంబంధిత సమస్యలు పెరగడానికి ఈ పొగ పీల్చడం కూడా ఒక కారణమని గ్రహించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

అంతేకాకుండా పొలంలో నిప్పు పెట్టడం వల్ల నేలలోని సూక్ష్మ పోషకాలు కూడా పాడవుతున్నాయని, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా చనిపోయి నేల నిస్సారం అవుతోందని, కాబట్టి వరి పంట వ్యర్థాలను తగలబెట్టే అలవాటును రైతులు తగ్గించాలని కోరారు.

దీనికి బదులుగా వరి పంట వ్యర్థాలను భూమిలోనే కలియుదున్నితే, తదుపరి పంటకు నేల మరింత బలంగా తయారవుతుందని, రైతులంతా దీనిపై దృష్టి పెట్టాలని ఎంపీ కోరారు.

ఇప్పటికే వాయు కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న విషయాన్ని అనేక నివేదికలు తెలియచేస్తున్నాయన్నారు. వాయు కాలుష్యం పెరిగి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితుల్లో భవిష్యత్ తరాల గురించి ఆలోచించి పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.


#DailyBharath #Eluru

Previous నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా దీక్ష దివస్
Next రోడ్డు ప్రమాదంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడికి సీపీఆర్ తో ప్రాణం పోసిన యువకుడు!
ADVERTISEMENT