| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న చందుర్తి ఎస్ఐ!

ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచి మానవత్వం చాటుకున్న చందుర్తి ఎస్ఐ!

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:చందుర్తి, మరిగడ్డ మార్గమధ్యంలోని ప్రభుత్వ కళాశాల సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అదే సమయంలో చందుర్తి నుంచి వేములవాడకు విధుల నిమిత్తం వెళ్తున్న చందుర్తి ఎస్ఐ ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్ ద్వారా సివిల్ ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఎస్ఐ తన సమయస్ఫూర్తి, సేవాభావంతో మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచే బాధ్యత కూడా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

#DailyBharath #RajannaSircilla

Previous టిఆర్టిఎఫ్ లో చేరిన పిఆర్టియు మాజీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి! రాష్ట్ర చీఫ్ అడ్వైసర్ గా నియామక పత్రం అందజేత!
ADVERTISEMENT