డైలీ భారత్, భద్రాచలం: నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సభకు మద్దతుగా రాష్ట్రస్థాయి మహిళా నాయకురాళ్ల పిలుపు మేరకు నిర్వహించిన చలో కరీంనగర్ కార్యక్రమంలో అశ్వారావుపేటకు చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు 14వ వార్డు కౌన్సిలర్ డా ఉదయ జ్యోతి, కాసాని పద్మ పాల్గొన్నారు.
వీరితో పాటు కేసప్పగూడెం సర్పంచ్ సోడెం భారతి, తిరుమలకుంటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మరియమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి మహిళా నాయకురాళ్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని దీక్షా దివస్ సందర్భంగా తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
#DailyBharath #Telangana