డైలీ భారత్,అశ్వారావుపేట: ఊట్లపల్లి వద్ద రోడ్డు దాటుతున్న బాలుడిని కారు ఢీకొట్టడంతో గాలిలోకి ఎగిరి పక్కనే ఉన్న వాహనానికి తగిలి అపస్మారక స్థితిలో పడిపోయాడు.
అదే సమయంలో రెడ్డిగూడెం వెళ్తున్న ముజాఫర్, మరో ఇద్దరు యువకులు ప్రమాదాన్ని కళ్లారా చూసి వెంటనే స్పందించారు. ముజాఫర్ బాలుడికి సీపీఆర్ చేయడంతో తిరిగి శ్వాస తీసుకున్నాడు. అనంతరం కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
#DailyBharath #Aswaraopet