డైలీ భారత్, అశ్వారావుపేట:అశ్వారావుపేట మండలంలోని నందిపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శివాలయ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జలగం ప్రసాదరావు మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని, భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని చాటుతాయని అన్నారు. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, భక్తులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగమని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండి చెన్నారెడ్డి, తాడేపల్లి రవి, కౌన్సిలర్ మిండా హరిబాబు, నారాయణపురం ఉపసర్పంచ్ ఆకుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
#DailyBharath #Aswaraopet