డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిఆర్టియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి వందలాది మంది ఉపాధ్యాయులతో కలిసి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ లో చేరారు.
ఈ సందర్భంగా వారికి సభ్యత్వాన్ని అందజేసిన టిఆర్టిఎఫ్ నాయకులు దామోదర్ రెడ్డిని టిఆర్టిఎఫ్ రాష్ట్ర చీఫ్ అడ్వైసర్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.
నియామక పత్రంలో టిఆర్టిఎఫ్ నాయకులు పేర్కొన్న వివరాల ప్రకారం, ఉపాధ్యాయ ఉద్యమంలో దామోదర్ రెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, విద్యా రంగం పట్ల అంకితభావం, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిబద్ధతను గుర్తిస్తూ ఈ నియామకం చేశారు. దామోదర్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దోమకొండలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.
సంఘ నియమ నిబంధనలకు లోబడి, ఉపాధ్యాయుల వ్యక్తిపరమైన సమస్యల పరిష్కారానికి మరియు వారి హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యా క్షేత్ర సమగ్రాభివృద్ధికి ఆయన విలువైన అనుభవాన్ని వినియోగిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా సంఘ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడంలో మరియు భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనలో తోడ్పాటు అందించాలని కోరారు.
ఆయన విలువైన సూచనలు, సలహాలు మరియు మార్గదర్శకత్వంలో సంఘం మరింత బలోపేతమై, ఉపాధ్యాయుల ఆశయ సాధనలో ముందుకు సాగుతుందని టిఆర్టిఎఫ్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
#DailyBharath #Kamareddy