| Daily భారత్
Logo




కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

News

Posted on 2026-08-25 17:39:09

Share: Share


కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

నూతన చైర్మన్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు 

డైలీ భారత్, కామారెడ్డి :కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌)కు నూతన చైర్మన్ల నియామకం జరిగింది.

బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, అంతంపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా చిట్టేడి సుధాకర్‌రెడ్డి, దోమకొండ పీఏసీఎస్‌ చైర్మన్‌గా అనంతరెడ్డి,మాచారెడ్డి పీఏసీఎస్‌ చైర్మన్‌గా నౌసిలాల్ నాయక్ నియమితులయ్యారు.

నూతనంగా నియమితులైన పీఏసీఎస్‌ చైర్మన్లు మంగళవారం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. 

రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం, రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర సేవలు పారదర్శకంగా అందేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

పీఏసీఎస్‌లు కేవలం రుణాలు అందించే సంస్థలుగా కాకుండా రైతుల ఆర్థికాభివృద్ధికి, వ్యవసాయ రంగం బలోపేతానికి కీలకమైన కేంద్రాలుగా పనిచేయాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు.

అలాగే సహకార సంఘాల కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ ప్రతి రైతుకు సమానంగా సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వ సహకారం అందేలా నూతన చైర్మన్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

అనంతరం నూతనంగా నియమితులైన పీఏసీఎస్‌ చైర్మన్లను మహమ్మద్ అలీ షబ్బీర్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తామని నూతన చైర్మన్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇలియాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాత రాజు,ఆశ పోయిన శ్రీనివాస్, నాగన్న గారి నరేందర్ రెడ్డి, బల్యాల సుదర్శన్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి , తిరుమల్ గౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్, సుతారి రమేష్, గణేష్ నాయక్, శ్యామ్ రెడ్డి, బాగా రెడ్డి, సర్పంచులు, ఐరన్ నరసయ్య, సంతోష్ రెడ్డి, మధు, సలీం, సంజీవరెడ్డి మన,  పాముల లింబాద్రి, దయాకర్ రెడ్డి, దుంపల మోహన్ రెడ్డి, బన్సీలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సహకార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >