Posted on 2026-05-06 15:24:08
డైలీ భారత్, బోధన్: లంచాలు ఇవ్వడం, తీసుకోవడం నేరం.. లంచాలను ప్రోత్సహించొద్దని ఏసీబీ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎక్కడో ఒక చోట అవినీతి బయటపడుతూనే ఉంది. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరిచిపోయి లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు.
తాజాగా ఓ పోలీస్ అధికారి సివిల్ వివాదంలో దూరి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. బోధన్ ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బోధన్ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న భాస్కరాచారి సివిల్ వివాదంలో ఓ వ్యక్తి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని లేదా 9440446106 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారి కోరారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >