| Daily భారత్
Logo




వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

News

Posted on 2026-05-06 19:43:56

Share: Share


వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

ప్రభుత్వ ఆర్డర్ ను గడువులోగా పూర్తి చేయాలి

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

హాజరైన హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్ ను అందజేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. 

గత ఏడాది 6 కోట్ల 85 లక్షల చీరలు ఆర్డర్ ప్రజా ప్రభుత్వం అందజేసిందని, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 130 మ్యాక్స్ సంఘాలతో పాటు కరీంనగర్ జిల్లా గర్షకుర్తి, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి మొత్తం 7 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చిందని, వీటిలో 95 లక్షల చీరలు (6.3 మీటర్ల పొడవు), 5 లక్షల చీరలు (9 మీటర్ల పొడవు) ఉన్నవి ఆర్డర్ ఇచ్చారని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం కోటి చీరల ఆర్డర్ ను అందజేసే కార్యక్రమాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా.. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా నూతన రంగుల చీరలను ఆవిష్కరించారు. 

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 

కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇవ్వాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే వస్త్ర పరిశ్రమ సంక్షేమం .. ఆర్థిక వృద్ధికి ఈ ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయని వెల్లడించారు. గత ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు.

సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు, గోచి చీరలు 5 లక్షలు మొత్తం కోటి చీరలు ఆర్డర్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే బకాయి ఉన్న దాదాపు రూపాయలు 352 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. వస్త్ర పరిశ్రమ కు ఉపయోగపడేలా వేములవాడలో రూ. 50 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి యారన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, 90 శాతం క్రెడిట్ పై యార్న్ ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వస్ర పరిశ్రమను అభివృద్ధిలోకి తీసుకురావాలని అన్ని కార్యక్రమాలను చేపడుతు న్నదని, పరిశ్రమలోని బాధ్యులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ వెంట ఉందని, అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.

ఆర్టీసీ సమ్మెను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం కార్మిక సంఘాలతో చర్చించి వారి సమస్యకు పరిష్కారం చూపిందని గుర్తు చేశారు. దీంతో ఆర్టీసీలోని దాదాపు 40 వేల మంది కార్మికులకు మేలు చేకూరుతుందని వివరిం చారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటుందని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్తుందని వెల్లడించారు.

నేతన్నకు భద్రత కింద రూ. 5 లక్షల బీమా ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుందని అలాగే చేనేత కార్మికులకు రూపాయల లక్షలు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 25 హెచ్ పీ ల వరకు విస్తరణ, కేటగిరీ మార్పు, ఇతర సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తు న్నామని తెలిపారు

వస్త్ర పరిశ్రమకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ఉపాధికి భరోసా కల్పిస్తుందని స్పష్టం చేశారు.

అనంతరం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ..

వస్త్ర పరిశ్రమలో తయారైన ఇందిరా మహిళాశక్తి చీరలు నాణ్యతతో ఉన్నాయని రానున్న ప్రభుత్వ ఆర్డర్లో కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. చీరల నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించడం అలాగే మార్పు తీసుకురావడం ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. సిరిసిల్ల అలాగే ఇతర ప్రాంతాల వస్త్ర పరిశ్రమ బాధ్యులు సొంతంగానే చీరలు ఇతర వస్త్రాలు నేస్తూ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. మిగతా యజమానులు ఆసాములు వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఆర్థికంగా సాయన్న సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

వస్ర పరిశ్రమ స్వయం సమృద్ధి సాధించాలని మార్కెట్తో అనుసంధానమై ఉండాలని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.  మహిళా శక్తి చీరలను ప్రజా ప్రభుత్వం అందజేసిందని, దీంతో పరిశ్రమకు 6 నుంచి 7 నెలల పాటు ఉపాధి అవకాశం ఉంటుందని వెల్లడించారు. వస్ర పరిశ్రమ యజమానులు ఆసాములు కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడకుండా యారన్ బ్యాంక్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తున్న మార్పులను గమనిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. స్థానిక వస్త్ర పరిశ్రమలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలు పండుగలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలు ధరించడం ఎంతో ఆనందంగా ఉందని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా చీరలు నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల శ్రమ, పనితనానికి ఈ చీరలు గుర్తుగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాములు నాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర రావు, ఏడీ సంతోష్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు తదితరులు పాల్గొన్నారు.

Image 1

వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

Posted On 2026-05-06 19:43:56

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎస్ఐ

Posted On 2026-05-06 18:54:08

Readmore >
Image 1

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

Posted On 2026-05-06 18:27:33

Readmore >
Image 1

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్తరైలు

Posted On 2026-05-06 18:26:34

Readmore >
Image 1

‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Posted On 2026-05-06 18:25:23

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ 2026-2027 నూతన కార్యవర్గం

Posted On 2026-05-06 18:21:36

Readmore >
Image 1

అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ సంచలన ఆపరేషన్

Posted On 2026-05-06 15:50:08

Readmore >
Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >