| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

రాఘవపూర్ శివారులో జూదం స్థావరంపై దాడి – 9 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో, ఈరోజు సాయంత్రం కామారెడ్డి సి.సి.ఎస్ పోలీసు సిబ్బంది దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవపూర్ గ్రామ శివారులో నిర్వహించిన ఆకస్మిక దాడిలో చిత్తు బొత్తు (జూదం) ఆడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడిలో మొత్తం 09 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి చిత్తు బొత్తు కాయిన్స్, రూ. 73,110/- నగదు, 02 మోటార్ సైకిళ్లు మరియు 06 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.

జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల వల్ల వ్యక్తులు తమ కష్టార్జిత సంపాదనను కోల్పోయి కుటుంబ సభ్యులు—తల్లిదండ్రులు, భార్య, పిల్లలు—తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, పేకాట, చిత్తు బొత్తు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి చర్యల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా, ప్రజలు చట్టాన్ని గౌరవించి సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పి  తెలిపారు.

Previous వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్
Next భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...
ADVERTISEMENT