డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన గున్నాల మమత, భర్త ఆంజనేయులు, వయస్సు 55 సంవత్సరాలు, కులం గౌడ్ అను ఆమె అతని కొడుకు అయిన గున్నాల శ్రీకాంత్ గల్ఫ్ దేశం వెళ్లి అక్కడే ఒక కంపెనీలో పని చేస్తున్నాడు. గున్నాల మమత తన కొడుకు శ్రీకాంత్ కి ఏజెంట్ లైసెన్స్ ఉందని అమాయక ప్రజలకి చెప్పి వారిని గల్ఫ్ పంపించి మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారిని విసిట్ వీసా మీద గల్ఫ్ దేశం పంపించి ఎటువంటి కంపెనీలో ఉద్యోగం చూపించకుండా వారిని మోసం చేసి అధికంగా డబ్బులు తీసుకునేది. ఇట్టి విషయంలో గతంలో కొనరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుండ్ల రాజు, తండ్రి నారాయణ అను అతని కొడుకు అయిన గుండ్ల నవీన్ ని కూడా గల్ఫ్ దేశం పంపిస్తానని అతని వద్దనుండి 1,70,000 రూపాయలు తీసుకొని గుండ్ల నవీన్ ను విజిట్ పిసా మీద దుబాయ్ పంపగా దుబాయిలో ఉన్న గున్నాల శ్రీకాంత్, నవీన్ ను అక్కడ కంపెనీలో కాకుండా మామూలుగా పని చేయించి అటు ఇటు తిప్పినాడు. కంపెనీ వీసా కోసం డబ్బులు తీసుకొని మోసం చేసి విజిట్ మీద పంపినారని డబ్బుల గురించి అడిగితే ఏం చేసుకుంటారో చేసుకో అని బూతులు తిట్టినారనీ గుండ్ల రాజు ఇచ్చిన r/o తిమ్మాపూర్ ఇచ్చిన దరఖాస్తుపై గున్నాల మమత పై మరియు అతని కొడుకు శ్రీకాంత్ పై ఎల్లారెడ్డిపేట ఎస్సై కే రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి నిన్న గున్నాల మమతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ గున్నాల మమతకు రిమాండ్ విధించారు. గున్నాల మమత కొడుకు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు.
News
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు