| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"ఆదివారం సిరిసిల్లలో ప్రతిభాదీప్తి పురస్కారాల ప్రదానం... విజేతలు వీరే!"

"ఆదివారం సిరిసిల్లలో ప్రతిభాదీప్తి పురస్కారాల ప్రదానం... విజేతలు వీరే!"

డైలీ భారత్, సిరిసిల్ల: ప్రదీప్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చాటుకున్న విద్యార్థులు, యువతకు అందించే ప్రతిభాదీప్తి పురస్కారాలను ఆదివారం నాడు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ గెంట్యాల భూమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

గోపాల్ నగర్ లోని ఎస్ఎస్ గ్రాండ్ బాంక్వెట్ హాల్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అతిథులుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంచాలకుడు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా ఎస్పీ మహేశ్ బి. గెతే, డీఎస్పీ నాగేంద్రచారి హాజరవుతున్నారని పేర్కొన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

పురస్కార విజేతలు వీరే...

చదువు, సాహిత్యం, క్రీడలు, చిత్రలేఖనంతో పాటు ఇతర రంగాల్లో ప్రతిభావంతులకు పురస్కారాలను అందజేయనున్నారు.

- విద్యారంగంలో: డాక్టర్ గూడూరి ప్రవీణ్

- సామాజిక సేవా రంగంలో: లగిశెట్టి శ్రీనివాస్

- సాహిత్యంలో: కృషి శతకం కృతికర్త గంభీరావుపేటకు చెందిన పర్సకుర్మ రిషిక

- క్రీడా రంగంలో: బత్తుల అక్షర

-పర్వతారోహణ రంగంలో: నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన విస్లావత్ బన్నీ

అలాగే జీవన సాఫల్య పురస్కారానికి పట్టణంలో ప్రసిద్ధ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీవాణీ రమణారావుకు అందజేయనున్నారు..

Previous టీఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా వింగ్ చైర్మన్ గా కుంచె లావణ్య
Next ధమ్మన్నపేట పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండుగ సంబరాలు
ADVERTISEMENT