| Daily భారత్
Logo




"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

News

Posted on 2026-07-01 03:44:21

Share: Share


"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన గొడుగు అరుణ్ చంద్ అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్‌లో మిక్చర్ ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి తెరిచి చూడగా అందులో చనిపోయిన బల్లి కనిపించిందని, ఈ విషయంపై వివరణ కోరేందుకు తిరిగి దుకాణానికి వెళ్లగా నిర్వాహకులు తనతో అనుచితంగా ప్రవర్తించి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ బాలాజీ స్వీట్ హౌస్‌ను తనిఖీ చేసి, ప్రాథమిక విచారణ అనంతరం బాలాజీ స్వీట్ హౌస్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ తనిఖీ లో ఎస్.ఐ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.


Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >