| Daily భారత్
Logo




మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

News

Posted on 2026-07-01 12:52:02

Share: Share


మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

డైలీ భారత్, మహబూబాబాద్:  మహబూబాబాద్ మండలం సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ పిట్టల యాకయ్య (57) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.

స్థానికుల కథనం ప్రకారం.. యాకయ్య మంగళవారం రాత్రి తన ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో యాకయ్య అక్కడికక్కడే అత్యంత కిరాతకంగా మృతి చెందారు.

బుధవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఆయన రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ హత్యకు వ్యక్తిగత విభేదాలా, పాత కక్షలా, లేక మరేదైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

మాజీ సర్పంచ్ హత్యతో సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >