| Daily భారత్
Logo




ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

News

Posted on 2026-06-30 14:39:24

Share: Share


ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి..

ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న సర్కార్.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పాఠశాల పూర్వ విద్యార్థి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

స్కూల్ అభివృద్ధికి రూ. లక్ష విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే.

క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేత, ఉద్యోగ విరమణ పొందుతున్న డీఈఓ, ఉపాధ్యాయుడికి సన్మానం.

డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట : విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, పాఠశాల పూర్వ విద్యార్థి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన తరగతి గదులను ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై ప్రారంభించారు. జాతీయ స్థాయి ఆటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అందించి అభినందించారు. అలాగే ఉద్యోగ విరమణ పొందుతున్న డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయుడిని సన్మానించి వారి సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈ విద్యాలయంలో అదనపు తరగతి గదులు పూర్తి చేయించామని తెలిపారు. ఈ విద్యాలయంలో బోధన, వసతులపై నమ్మకంతో తల్లిదండ్రులు పిల్లలను అడ్మిషన్ చేస్తున్నారని వివరించారు. 400 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పదో తరగతిలో ఈ పాఠశాల నుంచి చాలా మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారని వెల్లడించారు. ప్రతి విద్యార్థి తమ నేపథ్యం ఏదైనా తాము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే తాము అనుకున్న లక్ష్యం చేరుకుంటారని పేర్కొన్నారు. వివిధ ఉద్యోగాలు, స్వయం ఉపాధి, ఇతర రంగాల్లో స్థిరపడిన తర్వాత విద్యార్థులు సమాజానికి సేవ చేయాలని సూచించారు. విద్యార్థి దశలో మొక్కలు నాటాలని, పరిసరాల పరిశుభ్రత పై వివరించాలని, నీటి వృథాను అరికట్టాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.

 పాఠశాల అభివృద్ధిపై సీఎం దృష్టికి తీసుకెళ్తా..

పాఠశాల పూర్వ విద్యార్థి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. పాఠశాల ఎంతో మందికి దైర్యం ఇచ్చిందని, ఈ బడిలో సీటు రావడం చాలా కష్టంగా ఉండేదని గుర్తు చేశారు .తల్లితండ్రులకు కూడా నమ్మకం ఉందని తెలిపారు. అపుడు తమకు ఎంతో మంది ఉపాధ్యాయుల మార్గదర్శనం, సూచనలతో ఇప్పుడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని పేర్కొన్నారు. వివిధ దేశాలు, ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని వివరించారు. అందరూ సమానమేనని, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని తెలిపారు.  ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యా శాఖ ను తన వద్ద పెట్టుకొని దేశంలో మోడల్ గా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు,  స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. బొప్పాపూర్ స్కూల్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. స్కూల్ అభివృద్ధికి రూ. లక్ష విరాళం ప్రకటించారు. పాఠశాల అభివృద్ధిపై పూర్వ విద్యార్థి గా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, 

జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య, సర్పంచ్ గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >