| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

ఈ మధ్యకాలంలోనే మూడు ప్రమాదాలు జరగడం బాధాకరం...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేసిన భద్రాచలం  బిఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ఇమంది నాగేశ్వరరావు

వివిధ ప్రాంతాల నుంచి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు మరియు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే ప్రజలు బ్రిడ్జి దాటిన తరువాత  రోడ్డు మలుపు ప్రమాదాలకు తలుపులా మారింది. ఈ మధ్యకాలంలోనే మూడు రోడ్డు ప్రమాదాలు జరగడం గమనార్హం. అయినను అధికారులు సరైన రోడ్డు భద్రతా సాంకేతాలు ఏర్పర్చకపోవడం బాధాకరం. 

సైన్ బోర్డులు మరియు హెచ్చరికలు సంబంధిత విభాగం ఇప్పటికే  హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరం.

రోడ్డు భద్రతా సైడ్ రైలింగ్ , సైన్ బోర్డులు, రోడ్డు గీతాలు మరియు రోడ్డు బోర్డర్లలో రేడియం స్టిక్కరింగ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. 

కావున అధికారులు వెంటనే బ్రిడ్జి రోడ్డు మలుపు వద్ద ఈ సాంకేతికపు రోడ్డు భద్రత గుర్తులను ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను 

Previous కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Next వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్
ADVERTISEMENT