Posted on 2026-06-30 14:32:24
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ
కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమం
శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించి సాదరంగా సాగనంపిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి : పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్థంగా, అంకితభావంతో ప్రజలకు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు కొనియాడారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులకు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదవీ విరమణ పొందిన అధికారులను, వారి సతీమణులను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల రక్షణే ధ్యేయంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విధులు నిర్వర్తించడం పోలీసు వృత్తిలో అత్యంత గొప్ప సేవ అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఈ అధికారులు చేసిన కృషి పోలీసు శాఖకు గర్వకారణమని అన్నారు.
పదవీ విరమణ పొందిన అధికారులు:
ఎం.డి. ఉస్మాన్ – ప్రస్తుతం సీసీఎస్, కామారెడ్డిలో ఎస్‌ఐగా 36 సంవత్సరాలు సేవలందించారు. దత్తాద్రి గౌడ్ – ప్రస్తుతం దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా 36 సంవత్సరాలు సేవలందించారు. కె. శంకర్ – ప్రస్తుతం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్‌ఐగా 35 సంవత్సరాలు సేవలందించారు. ఎస్.కె. అహ్మద్ – ప్రస్తుతం రాజంపేట్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా 35 సంవత్సరాలు సేవలందించి పదవీ విరమణ పొందారు.
ఈ నలుగురు అధికారులు కానిస్టేబుళ్లుగా తమ పోలీసు ప్రస్థానాన్ని ప్రారంభించి, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ శాఖకు విశిష్ట సేవలందించారని జిల్లా ఎస్పీ గారు ప్రశంసించారు. వారి సేవా స్ఫూర్తి, వృత్తిపట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల అంకితభావం నేటి యువ పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో, ఆనందమయ జీవితాన్ని గడపాలని జిల్లా ఎస్పీ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >