| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భీమవరం శ్రీనివాస్ 

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నిర్మల భారత్ గ్యాస్  ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల రాజరాజేశ్వర హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు భీమవరం శ్రీనివాస్ అన్నారు . భారత్ గ్యాస్ ఏజెన్సీ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారని గ్యాస్ ఏజెన్సీ ఎదుట జిల్లా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మల గ్యాస్ ఏజెన్సీ కరీంనగర్ పేరుతో సిరిసిల్ల జిల్లా కేంద్రానికి లారీ తీసుకోవచ్చి అనుమతి లేకుండా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై  అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు పౌర సరఫరాల అధికారులు అక్కడి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో  పరమేశ్వరి  గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వేణు , ముస్తాబాద్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దామోదర్ రావు, కొనరావుపేట హెచ్ పి గ్యాస్ నిర్వహకులు గంప అభిషేక్, చందుర్తి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సత్తన్న, సహస్ర  గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు బాలకృష్ణ గంభీరావుపేట హెచ్.పీ గ్యాస్ నిర్వహకులు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు

Previous దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!
Next పశ్చిమ బెంగాల్ : సువేందు అధికారి పీఏ దారుణ హత్య...
ADVERTISEMENT