| Daily భారత్
Logo




‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

News

Posted on 2026-05-06 14:55:23

Share: Share


‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

డైలీ భారత్, హైదరాబాద్‌ :  ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో కనిపించిన ఉచిత సినిమా యాప్‌ ప్రకటనను నమ్మి డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో రూ.1.75 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం డీసీపీ టీ సాయి మనోహర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన బాధితుడు తన ఫోన్‌లో ఫేస్‌బుక్‌ చూస్తుండగా ‘లేటెస్ట్‌ మూవీస్‌ ఫ్రీగా చూడండి-ఇప్పుడే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి!’ అనే ప్రకటన కనిపించింది. ఆసక్తితో అందులోని లింక్‌పై క్లిక్‌ చేయగా, అది ‘జీడీసీఆర్‌.ట్యూబీ.టీవీ’ అనే వెబ్‌సైట్‌కి తీసుకెళ్లింది. అక్కడి నుంచి ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. యాప్‌లో సినిమా కూడా చూశాడు. కొద్దిసేపటి తర్వాత మొబైల్‌, యూపీఐ, ఇతర యాప్‌లు సరిగా పనిచేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతను వెంటనే తన బ్యాంక్‌ యాప్‌ను పరిశీలించగా, ఖాతా నుంచి 80వేలు డెబిట్‌ అయినట్లు గుర్తించాడు. అదే మొబైల్‌తో నిర్వహిస్తున్న తన తల్లి బ్యాంక్‌ ఖాతాను పరిశీలించగా.. దాని నుంచి కూడా 95వేలు మాయమైనట్లు తెలిసింది.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >