డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సిహెచ్. శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ మరియు జోన్-3 రాజన్న డిఐజి ఇన్‌చార్జ్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెన్షన్ కు కారణాలు:
నిబంధనల ఉల్లంఘన, విధుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం, మరియు అదుపులోకి తీసుకున్న నిందితులపై భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సస్పెండ్ అయిన ఎస్సై శ్రీకాంత్‌ను ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల డి.ఎ.ఆర్. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఈ సస్పెన్షన్ కాలంలో ఆయన హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని, వెళ్లాల్సి వస్తే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా గంభీరావుపేట ఎస్సైపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
#GambhiraopetSI #SircillaPolice #SISuspended